INDIA GREENS PARTY Telangana
ఇండియా గ్రీన్స్ పార్టీ తెలంగాణ
(Registered with the Election Commission of India under Section 29A of the Representation of the People Act, 1951. Registration Number: 56/476/2018-19/PPS-I, effective from 18/07/2019.)
Party HQ: 104, Vardhman Complex, 1st Floor, LSC, Savita Vihar, Delhi-110092.
Email: indiagreensparty@gmail.com Website: www.indiagreensparty.org
06 July 2020
Press Statement
రాష్ట్రంలో కోవిడ్ -19 ను సమర్ధవంతంగా పరిష్కరించాలని ఐజిపిటిఎస్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.
హైదరాబాద్, 06 July 2020: ఇండియా గ్రీన్స్ పార్టీ యొక్క రాష్ట్ర యూనిట్, ఈ క్రింది అంశాలను గమనించాల్సిందిగా రాష్త్ర ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది:
- తక్కువ సంఖ్యలో కోవిడ్ -19 పరీక్షలు
- కోవిడ్ -19 వివరాలను ప్రచురించడంలో పారదర్శకత
- ప్రైవేట్ ఆసుపత్రులలో అధిక ఫీసులు
- ఆన్‌లైన్ బోధన కి సంబంధించి విద్యా విధానంపై స్పష్టత
ఐజిపిటిఎస్(ఇండియా గ్రీన్స్ పార్టీ తెలంగాణ) తాత్కాలిక కమిటీ ఇక్కడ విడుదల చేస్తున్నపత్రికా ప్రకటనలో, సుమారు 3.5 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం మిలియన్ ప్రజలకు 2000 కి పైగా COVID పరీక్షలు మాత్రమే చేస్తుంది, ఇతర రాష్ట్రాలతో పోల్చితే చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నారు; ఉదాహరణకు, కేరళ ప్రభుత్వం మిలియన్ ప్రజలకి 7000 పరీక్షలు నిర్వహిస్తుంది అని గుర్తించింది. మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమయింది అని కమిటీ తెలంగాణ హైకోర్టుతో అంగీకరిస్తుంది. రాష్ట్రంలోని కోవిడ్ -19 పరిస్థితికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రచురించడంలో ప్రభుత్వం మరింత పారదర్శకం గా ఉండాలి అని ప్రభుత్వాన్ని కమిటీ కోరుతుంది. తెలంగాణ సరిహద్దు రాష్త్రాలు అయిన కర్ణాటక లో 21549 కేసుల తో మిలియన్‌కు 10,479 కోవిడ్ పరీక్షలు , ఛత్తీస్గఢ్ లో 3161 కేసుల తో మిలియన్‌కు 6259 కోవిడ్ పరీక్షలు , మహారాష్ట్ర 200000 కేసుల తో మిలియన్‌కు 8884 కోవిడ్ పరీక్షలు, ఆంధ్రప్రదేశ్ 17,699 కేసుల తో మిలియన్ కు 19000 కోవిడ్ పరీక్షలు మరియు తమిళనాడు 107000 కేసులతో మిలియన్‌కు 17000 పరీక్షల తో పరిస్థితి ఇలా ఉండగా. ఈ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో సమానమైన జనాభా సాంద్రత ఉంది మరియు దేశంలోనే 4 వ అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరానికి ఇళ్ళు అయిన మన రాష్త్రంలో సరైన పరీక్షలు చేయకపోవడం వలన కేసుల సంఖ్య ప్రస్తుతం చూపించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని కమిటీ అనుమానం వ్యక్తం చేస్తుంది. మన పొరుగు తెలుగు రాష్త్రంలో చేపట్టిన రాపిడ్ డయాగ్నొస్టిక్ టెస్టింగ్ వ్యూహాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించాలని కమిటీ కోరుతుంది.
ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, అన్ని పరీక్షా కేంద్రాలు రాష్ట్ర రాజధానిలో ఉన్నాయి. తగినన్ని పరీక్షలు జరగట్లేదు అని కమిటీ అనుమానించడానికి ఇది మరొక కారణం. జిల్లా స్థాయిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రభుత్వానికి కోరుతుంది.
ప్రైవేటు పరీక్షా కేంద్రాలలో COVID-19 పరీక్షలకు ధరల పరిమితి పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను తాత్కాలిక కమిటీ ప్రశంసిస్తుంది. అయితే, వనరుల కొరతను చూపుతూ, ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా కొన్ని ప్రైవేటు లాబ్స్ నిర్ణీత మొత్తాని కంటే ఎక్కువ వసూలు చేస్తున్నాయని కొన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ మరియు వార్తా కథనాలు కమిటీ దృష్టికి వచ్చాయి. ప్రభుత్వం తన ఉత్తర్వులను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరుతుంది.
మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ గందరగోళంలో పడింది. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మరియు విద్యాసంస్థలు మొత్తం ఫీజులను వసూలు చేస్తూన్న సంఘటనలు కమిటీ దృష్టి కి వచ్చాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మొత్తం ఫీజు వసూలు చేయడం అన్యాయమని కమిటీ అభిప్రాయపడుతుంది. తెలంగాణ హైకోర్టు కోరిన విధంగా కొత్త విద్యా విధానాన్ని వీలయినంత తొందరగా రూపొందించాలని కమిటీ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇంకా, కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న విధంగానే తెలంగాణ లో కూడా 5 వ తరగతిలోపు విద్యార్థులకి ఆన్‌లైన్ తరగతులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ విషయంపై తల్లిదండ్రులకు మరియు కార్యకర్తలకు కమిటీ సంఘీభావం తెలుపుతుంది మరియు కొత్త విద్యా విధానాన్ని రూపొందించేటప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం తమ దృష్టిలో ఉంచుకోవాలి అని కమిటీ కోరుతుంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న ఆన్‌లైన్ విద్యా సేవలను పొందటానికి మారుమూల ప్రాంతాల మరియు పేద విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం లేదా ఇంటర్నెట్ అందుబాటులో ఉండవని గమనించాలి, అందువల్ల ప్రభుత్వం పేద విద్యార్థులకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించాలని కమిటీ సూచిస్తుంది.
-Press Statement issued by Rahul Gupta Kodarapu, national
secretary and member of the IGP Telangana Ad-hoc Committee.
References :
- https://www.covid19india.org/
- https://www.ndtv.com/india-news/telangana-high-court-not-satisfied-with-government-report-on-covid-testing-2255936
- https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/apr/19/community-screening-4-types-of-tests-to-ramp-up-testing-to-17300-per-day-in-andhra-pradesh-2132242.html
- https://covid19.telangana.gov.in/health-facilities/testing-centres/
- https://www.newindianexpress.com/states/telangana/2020/jun/18/despite-price-cap-private-hospitals-bleed-covid-19-patients-dry-in-telangana-2157981.html
- https://www.timesnownews.com/education/article/policy-on-online-classes-and-academic-year-of-states-schools-to-be-released-by-july-13-telangana-govt/616283
- https://timesofindia.indiatimes.com/city/hyderabad/parents-activists-seek-ban-on-online-classes/articleshow/76348382.cms